ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని చందక పంచాయతీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు స్థానిక సర్పంచ్ బంక శ్రీను చెప్పారు.
ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ను కలుసుకుని సమస్యలపై తెలియజేయడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
పంచాయతీ లో గల జగన్నాధపురం, చందక, జగ్గరాజు పాలెం, నిమ్మల వారి కళ్ళాలు, ఎడ్ల వారి కళ్లాలు, నొడగల వారి కళ్లాలులో ఇటీవల పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్లు, మంచి నీటి వసతి, వైద్యం వంటి వాటికి ముందుగా ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు సర్పంచ్ బంక శ్రీను పేర్కొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )