*ఆనందపురం* : మండలంలోని మిందివానిపాలెం గ్రామంలో సరస్వతీ విజ్ఞాన విహార ఉపాధ్యాయురాలు డి. అరుణ గారి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల వేసిన స్వాతంత్ర సమరయోధులు వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జెండాను ఎగురవేసి, జెండా వందనం చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సరస్వతీ విజ్ఞాన విహార ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.