మనసులు పరిమళించిన వేళ" పుస్తక ఆవిష్కరణ

ఆనందపురం:జనసేవ న్యూస్
 ద్వారకానగర్ లొని పౌర గ్రంధాలయంలొ ఆదివారం విశాఖ రచయితల సంఘం,హిందీ జర్నలిస్టుల సంఘం, ఎ.పి(వాజా) ల ఆధ్వర్యంలొ రచయిత సుసర్ల సర్వేశ్వర శాస్త్రి రచించిన 'మనసులు పరిమళించిన వేళ'(కధల సంపుటి), 'విజయసేనుడి విజయయాత్ర'(బాలల నవల) పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. 

ప్రముఖ రచయిత జయంతి ప్రకాశ శర్మ, రచయిత మాతృమూర్తి శ్రీమతి ఎస్.ఎ.నరసమ్మ పుస్తకాలను ఆవిష్కరించారు. రచయిత మేడా మస్తాన్ రెడ్డి గారు సభకు అధ్యక్షత వహించారు.

 ప్రముఖ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు తన ముందు మాటలొ ప్రతి కధ మనసును పరిమళింప చేస్తుందని అభినందించారు. కేంద్ర సాహిత్య(బాల) అకాడమీ అవార్డు గ్రహీత,రచయిత నారంశెట్టి ఉమా మహేశ్వరరావు బాలల నవలపై ముందు మాటలొ నవల పిల్లలను,పెద్దలనూ అలరిస్తుందని,ప్రతి పాత్ర,సంభాషణా నేటి తరాన్ని ఆలొచింప చేస్తుందని అభినందించారు. 

వాజా కార్యదర్శిడాక్టర్ సీ.హెచ్.నిర్మల రచయితను అభినందించి పుస్తకాలను సమీక్షించారు. నటులు,రచయిత,సభాధ్యక్షులు మేడా మస్తాన్ రెడ్డి రచయిత కలం అన్ని వైపులా పదునే అని పెద్ద,చిన్న,బాలల, హాస్య కధలతొనిరూపించారన్నారు. 

ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బలి హైమవతి,ఆచార్య కందర్ప విశ్వనాధ్,డాక్టర్ మూర్తి,ఎస్.నాగభూషణరావు, శ్రీమతి కళ్యాణ గౌరి, కోనెవెంకటనాగాంజనేయులుపుస్తకాలపైతమఅభిప్రాయాలను తెలియ చేసారు.రచయితను,ప్రముఖ చిత్రకారులు పి.వి.ఆర్. మూర్తి గార్లను సన్మానించారు. దేవులపల్లి దుర్గాప్రసాద్ స్వాగతం పలుకగా శ్రీమతి భానుమతి ప్రార్ధనా గీతం పాడారు. 

చివరిగా శ్రీమతి పంతుల లలిత వందన సమర్పణ చేసారు.ఈ కార్యక్రమంలో నగర
తెలగాణ్య బ్రాహ్మణ అభ్యుదయ సమాజం కార్యవర్గ సభ్యులు గాడేపల్లి ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )