iti దరఖాస్తు గడువు పెంపు :


 *విశాఖపట్నం* : ప్రభుత్వ ఐటిఐ కళాశాల ల దరఖాస్తు గడువు పొడిగించినట్టు కన్వీనర్ తెలిపారు. 
ఈ నెల 25 తేదీ తో ముగిసిన గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 12వ తేదీ వరకు పెంచుతూ సర్క్యూలర్ విడుదల చేసారు. 
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 
iti.nic.in  వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కంచరపాలెం ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ జె.శ్రీకాంత్  తెలిపారు. 
దరఖాస్తుదారులకు కౌన్సెలింగ్ తేదీ ల సమాచారం ఫోన్ మెసేజ్ ద్వారా గాని, పత్రిక ప్రకటన ద్వారా గాని తెలియజేస్తాం అని చెప్పారు.