ప్రజా వైద్యుడు సురేష్ బాబుకు ఘన సన్మానం
ఆనందపురం:జనసేవ న్యూస్
సమాజ అభివృద్ధిలో భాగంగా న్యూ హోప్ ఫౌండేషన్ చేసిన కార్యక్రమా లో భాగంగా నగరంలోని పౌర గ్రంథాలయంలో
కరోనా వారియర్స్ సేవలు అందించిన వ్యక్తులను సత్కరించడం జరిగింది ..
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ మేయర్ గారు శ్రీ గొల గాని హరి వెంకటి కుమారి గారు వివిధ రంగాలలో అనగా వైద్య రంగము మీడియా రంగము పోలీసు రంగము లో కరోనా సేవలు అందించిన వారిలో అనగా వైద్య రంగమునకు సంబంధించి క్లిష్ట కరోన పరిస్థితులలో అత్యంత వైద్య సేవలు అందించిన తమ కుటుంబాన్ని కూడా లెక్కచేయని ప్రజా వైద్యుడు డాక్టరు కుప్పిలి సురేష్ బాబు కు ఘనంగా మేయర్ గారు శాలువా కప్పి మెమెంటో, ప్రశంసా పత్రం
''కరోనా వారియర్ ఆఫ్ ది ఇయర్ - 2021''ఇచ్చి ఘనంగా సత్కరించారు ...
అలాగే పోలీస్ రంగంలో రూరల్ ఎస్పీ శ్రీనివాస్ గారికి మీడియాకు సంబంధించి సిద్ధూ నగేష్ లను కూడా సత్కరించారు ఫౌండేషన్ అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ప్రతి సంవత్సరము ఈ కోవిడ్ అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము అని తెలిపారు ..
దీనికి శాసనసభ్యులు పి వి ఎస్ మాధవ్ ,మాజీ గ్రంధాలయ చైర్మన్ తోట నాగేశ్వరరావు, అలాగే అలాగే సంస్థ సభ్యులు శ్రీనివాసులు లక్ష్మీ ప్రవీణ తదితరులు హాజరయ్యారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )