రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ఓ ఎమ్మార్వో కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ నందమూరి తారక రామారావు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఆయన్ని ఒక్కసారిగా చూసిన స్థానికుల, అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా అందరూ ఒక్కసారిగా వచ్చి ఫోటోలు, సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ :
సురేష్.