కర్రి స్వామి అర్దవ్యం లో మెగా శక్తి దానం

కర్రి స్వామి అర్దవ్యం లో మెగా శక్తి దానం

ఆనందపురం:జనసేవ న్యూస్

శ్రీ కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు (కర్రి స్వామి) మరియు గ్రామీణ వైద్యుల సంఘం  సెక్రెటరీ ( లోగిశ గణేష్ )వారి ఆధ్వర్యంలో లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పఠాన్ చాంద్ ఖాన్ , వారి సిబ్బంది పర్యవేక్షణలో రక్త దాన శిభిరం స్థానిక శ్రీనివాస కల్యాణ మండపం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 



ఈ కార్యక్రమంలో సుమారుగా 76 మంది దాతలు పాల్గొని రక్త దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు గారు మరియు స్థానిక నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  

ఈ కార్యక్రమంలో శ్రీ కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మాట్లాడుతూ... కరోనా విపత్తు వలన రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ లకు రక్త నిలువల కొరత ఏర్పడిందని దానివలన అనేకమంది ప్రజలు రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఈ యొక్క రక్త దాన శిభిరం ముఖ్యంగా జరిపామన్నారు. 

గడిచిన ఈ విపత్తులో శ్రీ కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ 98 వ వార్డ్ లో నిరంతరంగా  108 రోజులు అనేక  సేవా కార్యక్రమాల ద్వారా నిత్యావసరాల సరుకులు మరియు పేద వారికి ఆహార పదార్థములు అందించామని అన్నారు.

ఇదే విధంగా త్వరలోనే సుమారు పది రోజులలో భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయునున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమానికి పార్టీ లకు అతీతంగా స్థానిక నాయకులు పాల్గొని రక్త దాతలకు అభినందలు తెలిపినందుకు కర్రి అప్పలస్వామి ( స్వామి) కృతజ్ఞతలు తెలియజేశారు.


జి. రవి కిషోర్. బ్యూరో చీఫ్

జనసేవ వార్తలు దయచేసి ఈ పోస్ట్ అందరికీ పంచుకోండి