పెద్దిపాలెం లో కిసాన్ మోర్చా సమావేశం
ఆనందపురం :జనసేవ న్యూస్
జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పి. వి. వి. ప్రసాద్ రావు పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆనందపురం మండలం లోని పెద్దిపాలెం లో గల కింగ్స్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్ రవి రాజ్, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు వసంత కుమార్ వర్మ తదితరులు హాజరు కానున్నట్లు ప్రసాదరావు పట్నాయక్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )
ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.