అల్లిపురం:జనసేవ న్యూస్ (విశాఖ )
స్థానికంగా కొలువుతీరిన శ్రీ రాచ పోలమాంబ అమ్మవారి పండగ మహోత్సవం అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం గా ఉత్సవం జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ టిడిపి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కులమతాలకు అతీతంగా అందరూ హాజరు రావటం పై ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం. డి. నజీర్, టిడిపి అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి, 32 వార్డు టిడిపి అధ్యక్షుడు దాసరి దుర్గా రెడ్డి, పంపానా రాజ్యలక్ష్మి దేవరాజ్ ,రమేష్, రాంబాబు,వాసు కనకరాజు తదితరులు పాల్గొనగా భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )