గ్రామ సచివాలం లో జెసి ఆకస్మిక సందర్శన

జెసి ఆకస్మిక సందర్శన

 ఆనందపురం: జనసేవ  న్యూస్
 మండలంలోని వేములవలస గ్రామ సచివాలయాన్ని గురువారం విశాఖ జాయింట్ కలెక్టర్ అరుణ బాబు ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వేములవలస గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని విజ్ఞాపన చేశారు.
Surprise check in ap sachivalayam
ఈ మేరకు స్వయంగా జెసి రంగంలోకి దిగి డ్రైనేజీ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం మార్గం  చూపిస్తాం అన్నారు. ఇకపోతే సచివాలయ సిబ్బంది స్థానికంగా నివాసం ఏర్పరుచుకుని విధులను నిర్వర్తించాలి  అన్నారు.  సమయపాలన పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వెల్లంకి సచివాలయాన్ని కూడా ఆయన సందర్శించి సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు.
 
జి.రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )
జనసేవ వార్తలు : ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.