రేషన్ డిపోలు పరిశీలించిన కేంద్ర బృందం :


 ఆనందపురం : మండలం లోని పలు రేషన్ డిపోలు పరిశీలించిన కేంద్ర బృందం.  ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత రేషన్, పథకాన్ని,Mr. కె.గిరిజ శంకర్ సీనియర్ కన్సల్టెంట్  మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, న్యూఢిల్లీ, టీమ్ మెంబర్లు, పి.వి. నాగేశ్వరావు, విజయవాడ ఏ.ఎస్.ఓ, మధుసూదన్ రావు, రవి ప్రతీక్ సి.డి.ఎఫ్.సి.జైపూర్ ఆధ్వర్యంలో వెల్లంకి,పెద్ది పాలెం, రేషన్ డిపో లో తనిఖీలు చేయబడింది. 


ఈ సందర్భంగా కె.గిరిజ శంకర్ సీనియర్ కన్సల్టెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ  మాట్లాడుతూ గ్రామల్లో రేషన్ తీసుకున్న లబ్ధిదారుడు చనిపోయిన వారిని తొలగించి, వాళ్ళ రేషన్ కార్డ్ లోని పేరును రద్దు చేయాలని వీఆర్వో గారికి తెలియజేశారు. 

అదేవిధంగా పెళ్లి చేసుకుని వెళ్లి పోయిన వారి ఆధార్ కార్డు నెంబర్ కూడా తొలగించాలని సూచించారు. గత సంవత్సరం  కరోనా కష్టాలలో ప్రధానమంత్రి  గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఎనిమిది నెలల పాటు,(ఏప్రిల్ నుండి నవంబర్ వరకు) ఉచిత రేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. ఈ  సంవత్సరం కూడ దీపావళి వరకు ప్రధానమంత్రి కళ్యాణ్  అన్న యోజన   ఎనిమిది నెలలు బియ్యం, ఫ్రీ రేషన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 




కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని  అందరూ ఉపయోగించుకోవాలని, ఆయన సూచించారు. వెల్లంకి, పెద్దిపాలెం, గ్రామాలలో ప్రజలు బాగా సహకారం అందించారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, బిజేపి కిసాన్ మోర్చా, ప్రధాన కార్యదర్శి, విశాఖ పార్లమెంట్ జిల్లా నాయకులు,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, బిజేపి మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు, బిజెపి యువ నాయకులు,పి.సాయి రమేష్, వి.ఆర్.ఓ అప్పారావు,రేషన్ డిపో డీలర్,పి.సాయి లక్ష్మీ, పి.కనక రావు, పెద్దిపాలెం డీలర్,జి.విజయ  తదితరులు పాల్గొన్నారు.


రిపోర్టర్ : సురేష్