గోమతలకు రక్షణ కరువు :
రాష్ట్రంలో గోమతలకు రక్షణ కరువైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ మెంబర్ విజయ శంకర ఫణీంద్ర అన్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో గోమాతను ఖననం చేసిన ప్రాంతం వద్ద ఆయన నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత కోసం వచ్చినటువంటి గోమాతలను సెక్యురిటి ఆఫీసర్ ఖాన్ మరియు అతని సిబ్బంది గోమాత ను పట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర కట్టేసి స్థానిక రైతుకు తెలిపి పదివేల రూపాయలు జరిమానా కట్టమని చెప్పారని వెంటనే రైతు అంత మొత్తం నా దగ్గర లేదు అని స్థానిక జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మూర్తి యాదవ్ గారి ద్వారా మాట్లాడించి,
వెయ్యి రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీ పేరుమీద జరిమానా కట్టడం జరిగిందని, ఈలోగా ఆ గోమాతకు సరైనటువంటి సదుపాయం లేక నిరసించి రాత్రి 10:30 కు గోమాత కాలం చేసిందని రైతు వెంకట్రావు కు సిబ్బంది తెలిపారని, రైతుకు తెలియకుండా తెల్లవారుజామున ఆయన వచ్చే లోపల ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆ గోమాత ని ఖననం చేయడం జరిగిందని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
చనిపోయిన గోమాతను రైతుకు ఇవ్వకుండా ఇలా పిల్లలు ఆడుకునే ప్రదేశాలలో ఖననం చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుందని అందువలన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రశ్నిస్తూ మరియు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరడం జరిగిందని అన్నారు.
ఇటీవల గోమాతల అక్రమ రవాణా పై పోలీస్ కమిషనర్ కు, జీవిఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేశామని, వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పారని ఈ లోపే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దారుణం అని అన్నారు.
దీనిపై పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే బిజెపి, జనసేన, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలతో కలిసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మూర్తి యాదవ్, జోగరావు గారు, రుద్ర గారు, ధనుంజయ గారు మరియు స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.
జనసేవ రిపోర్టర్
సురేష్
దయచేసి ఈ పోస్ట్ అందరికీ పంచుకోండి