భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

 *భీమునిపట్నం* : 
భీమిలి సన్ స్కూల్ వేదికగా భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఏ.ఎస్ రాజా బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో  20వ రక్తదాన శిబిరాన్ని  నిర్వహించారు. స్ధానిక వైద్యులు డాక్టర్ ఎన్ ఎల్ రావు ముఖ్య అతిధిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ప్రారంభం అయినప్పటినుండి రక్త కొరత ఎక్కువగా ఉందని ఆ కొరతను భర్తీ చేయడానికి భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరచూ ఈవిధంగా రక్తదానం శిబిరాలు నిర్వహించడం అభినీయం అన్నారు. 
బీ.ఎన్.డబ్ల్యూ అధ్యక్షులు కైతపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక యువత అంతా ఎక్కువ సంఖ్యలో ప్రతిసారీ తాము నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరుగుతుందని ఇక్కడ ఎవరికి రక్తం అవసరం అయినా, వెంటనే వారికి డోనర్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 
ఈ రక్తదాన శిబిరంలో 82 మంది పాల్గొని రక్తం దానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బి.ఎన్.డబ్ల్యూ సభ్యులు కొత్తా రామకృష్ణ, ఎమ్. సూర్యశ్రీనివాస్, ఆడిదం కిషోర్, కాళ్ళ సన్నీ, రాజేటి బసవ కృష్ణ మూర్తి, డాక్టర్ ముమ్మిడిశెట్టి ఆదిత్య, వెంపాడ శ్రీనివాసరెడ్డి, జి.ఆర్ ఉమ, ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎ రాధారాణి, మేనేజర్ రామ్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.