భీమిలిలో ఉన్న ఎన్. టి.ఆర్. మున్సిపల్ మినీ స్టేడియంలో మౌళికవసతులు కల్పించండి..!
-- జోనల్ కమీషనర్ కి టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విజ్ఞప్తి
ఆనందపురం:జనసేవ న్యూస్
భీమిలిలో ఉన్న ఏకైక ఎన్.టి.ఆర్. మున్సిపల్ మినీ స్టేడియంలో మౌళికవసతులు కల్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు జోనల్ కమీషనర్ ఎస్. వెంకటరమణకు ఇచ్చిన వినతిపత్రంలో కోరడమైనది.
స్టేడియంలో ఉన్న వాకింగ్ ట్రాక్ రాళ్లతో నిండి ఉండటం వలన వాకర్స్ కి, ప్లేయర్స్ కి ఇబ్బందిగా ఉంది. అందువలన ట్రాక్ ను రిపేర్లు చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు.
టాయిలెట్స్ రిపేర్లు చేయించి అందుబాటులోకి తేవాలని అన్నారు.
స్టేడియంలో లైట్లు లేకపోవడం వలన ఈవెనింగ్ వాకర్స్ కి ఇబ్బందిగా ఉంది , అందువలన లైట్లు వేయాలని కోరారు.
క్రీడాకారుల దాహార్తిని తీర్చుటకు మంచినీరు అందుబాటులో లేదు. అందువలన బోర్ వెల్ వేయాలని సూచించారు.
స్టేడియంలో ఉన్న స్టేజ్ రిపేర్లో ఉంది దానిని బాగుచేసి అందుబాటులోకి తేవాలి.
భీమిలిలో ఒకేఒక్క స్టేడియం ఉండటం వలన స్థానికులు ఎక్కువమంది వాకర్స్ గాని, ప్లేయర్స్ గాని, సందర్శకులు కూడా ఎక్కువమంది ఉంటారు. ఆదివారం వచ్చిందంటే ఎక్కువమంది క్రికెట్, వాలీబాల్ ప్లేయర్స్ అక్కడ ఆడాలని అనుకుంటారు.
కానీ జోనల్ అధికారులు బయటివ్యక్తులకు లీజుకు ఇవ్వడం వలన స్థానిక క్రీడాకారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందువలన ఆదివారం స్థానిక క్రీడాకారులకు స్టేడియంను అందుబాటులోకి వచ్చేవిధంగా చేయగలరు.
పైన సూచించిన సమస్యలను పరిష్కరించవలసినదిగా కోరడమైనది.
-జి. రవి కిషోర్(బ్యూరో చీఫ్)