రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు దుర్మరణం
ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని బోయపాలెం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ జిల్లా పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన రావి సూర్యరావు (50) భార్య సత్యవతి (45) కుమారుడు శ్రీనివాసరావు తో కలిసి నివాసముంటున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం సూర్యారావు, సత్యవతి ఇద్దరు కలిసి స్కూటీపై విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో రావాడ గ్రామం లో తమ బంధువులు ఇంట్లో ఫంక్షన్ కు బయల్దేరారు.
గంభీరం పంచాయతీ బోయపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుకనుండి వేగంగా వస్తున్న లారీ స్కూటర్ పై నుంచి దూసుకెళ్లడంతో భార్య భర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సూర్యారావు స్క్రాప్ షాప్ లో పని చేస్తున్నాడు.
కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఈ కేసును ఆనందపురం సీఐ రవి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.
-జి. రవి కిషోర్(బ్యూరో చీఫ్)