వేములవలస లో వీధి రోడ్లు విస్తరణకు చర్యలు

వేములవలస లో వీధి రోడ్లు విస్తరణకు చర్యలు

ఆనందపురం:జనసేవ న్యూస్ 


మండలంలోని వేములవలస గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ఛిద్రమయ్యాయి.

దీన్ని దృష్టిలో పెట్టుకొని  ఎస్సీ కాలనీలో రోడ్లు, భూగర్భ  డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ శ్రీకారం చుట్టారు.

శనివారం మండల అసిస్టెంట్ ఇంజనీర్ బి. వెంకటేశ్వరరావు తో చర్చించి కొలతలు వేయించారు. వ్యయం ఎంతవుతుందో నని ఆయన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాత సినిమా హాల్ వెనుకభాగం లో రోడ్లు  అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఎస్సీ బీసీ కాలనీ లో రెండు కలవర్టులు, పూల మార్కెట్ ఆర్చ్ నుండి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తెలిపారు.



అన్ని సదుపాయాలు కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు  సచివాలయ సిబ్బంది

 మోహన్, 

మార్కెట్ ఆసిల్ కాంట్రాక్టర్ బోద అప్పలరాజు, 

బోద నారాయణ అప్పడు, 

ఎర్రాజీ స్వామి నాయుడు, 

కోరాడ రమణ తదితరులు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )